* ప్రజా ప్రభుత్వం 1000 రోజుల విజయాలను చాటుతూ భారీ ర్యాలీ
నల్గొండ: నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో “వికాస యాత్ర”ను ఘనంగా నిర్వహించారు. శివాజీ నగర్ నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం 1000 రోజుల్లో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. ప్రజా ప్రభుత్వ పాలనకు అభినందనలు తెలియజేస్తూ నినాదాలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా వికాస యాత్ర నిర్వహించినట్లు తెలిపారు.

