Wednesday, July 15, 2026

Buy now

ఎస్ఐఆర్ పై పూర్తి అవగాహనతో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలి :మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

పెద్దపల్లి : ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై మాట్లాడారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాజశ్రీ గార్డెన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్ఐఆర్ కమిటీ సభ్యులు సతీష్ రెడ్డి ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటరు జాబితా సవరణలు, దరఖాస్తుల సమర్పణ విధానం, పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన పెంపొందించుకున్నారు. ప్రతి అర్హులైన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా, ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ రాష్ట్ర ఎస్ఐఆర్ కమిటీ ఇంచార్జ్ ఎల్. రమణ అధ్యక్షత వహించగా, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular