Friday, September 4, 2026

Buy now

కృష్ణవేణి స్కూల్స్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

* శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలో అలరించిన చిన్నారులు.. ఉట్టి కొట్టే కార్యక్రమంతో సందడి

గోదావరిఖని, NTPC, సెప్టెంబర్ 3: కృష్ణవేణి స్కూల్స్ గోదావరిఖని, NTPC శాఖల్లో కృష్ణాష్టమి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమక్షంలో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధా వేషధారణలో అలరించారు. చిన్నారుల కృష్ణుడు, గోపికల వేషధారణ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు శ్రీకృష్ణుడి బాల్య లీలలు, గోపికలతో ఆటలు, గోవర్ధనగిరి ఘట్టం తదితర సాంస్కృతిక ప్రదర్శనలను అద్భుతంగా ప్రదర్శించారు.

ఉట్టి కొట్టే కార్యక్రమంతో సందడి/;
వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమం, భక్తిగీతాలు, నృత్య ప్రదర్శనలు, శ్రీకృష్ణుని జీవిత విశేషాలను తెలియజేసే పలు కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు.

సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన:
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. శ్రీకృష్ణుని బోధనలు, ధర్మం, కర్తవ్యనిష్ఠ, సత్యం, ప్రేమ, ఐక్యత వంటి విలువలను విద్యార్థులు తమ జీవితాల్లో ఆచరించాలని సూచించారు.
కృష్ణాష్టమి వేడుకలు విద్యార్థుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు, మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని మరింత పెంపొందించాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

పాల్గొన్న పాఠశాల నిర్వాహకులు:
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మంజుల శ్రీనివాస్ రెడ్డి, అకడమిక్ ప్రిన్సిపాల్ రామకృష్ణ, ప్రిన్సిపాల్స్ రాజిరెడ్డి, సత్యనారాయణ, శైలజ, సిరాజ్ బేగ్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular