Thursday, September 3, 2026

Buy now

ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువ

* నూతన MRO కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
* పాలకుర్తి అభివృద్ధికి మరిన్ని అడుగులు.. త్వరలో MPDO కార్యాలయం, 2 కోట్లతో మహిళా భవన్

పాలకుర్తి :రామగుండం నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పాలకుర్తి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు.

ఈరోజు పాలకుర్తి మండలంలో తహసీల్దార్, సంయుక్త సబ్ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నూతన కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం, అధికారుల సమన్వయంతో నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. పాలకుర్తి మండల ప్రజలకు పరిపాలనా సేవలు మరింత చేరువ చేసేందుకు త్వరలోనే MPDO కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

అలాగే పాలకుర్తి మండలంలో మహిళల కోసం రూ.2 కోట్లతో మహిళా భవన్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళలకు అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెప్పారు.

పాలకుర్తి మండలాన్ని భవిష్యత్తులో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మౌలిక వసతులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మండల అభివృద్ధికి మరింత ఊతం ఇస్తామని అన్నారు.

అనంతరం తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న నూతన డిజిటల్ రేషన్ కార్డులను మహిళలకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో MRO, MPDO, ACP, CI, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular