Friday, September 4, 2026

Buy now

ఫీజుల బకాయిలపై బీజేపీ లడాయి

పెద్దపల్లి : జిల్లా కేంద్రంలో ఒక్కరోజు నిరసన ,రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.

రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అదే విధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్ల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల చదువులు, భవిష్యత్తును దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం ఇంతటితో ఆగదని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఫీజు బకాయిల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీఎం, మంత్రులు ప్రజల్లోకి వచ్చే ప్రతి సందర్భంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.

పేద విద్యార్థుల విద్యకు ప్రభుత్వం అండగా నిలవాలని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎలాంటి జాప్యం లేకుండా ఫీజు రీయింబర్స్‌ మెంట్, స్కాలర్‌ షిప్‌ల బకాయిలను పూర్తిగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బెజ్జంకి దిలీప్ అమరగాని ప్రదీప్, సౌదరి మహేందర్, కాసగోని నిర్మల, శివంగారి సతీష్ కుమార్, మచ్చగిరి రాము, పెంజర్ల రాకేష్, కసిపేట శివాజీ, చిలుక భారతి, రఫీ, మచ్చ విశ్వాస్, అరుణ్ రామ్ జా, సంతోష్, సుభాష్, రేణుక, అపర్ణ, రామగిరి అఖిల్, ఊషణ అన్వేష్, బూతగడ్డ రాజు కుమార్, రెండ్ల వేణు, మధుకరణ్, శివసాయి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular