రామగుండం: సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్జీ-01 ఏరియాలోని ఓసీపీ-05 వద్ద జరిగిన ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమన్వయం చేసుకున్నారు.

