Wednesday, July 15, 2026

Buy now

రూ.359.09 కోట్ల హ్యామ్ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వనపర్తి: జిల్లా అభివృద్ధిలో భాగంగా రూ.359.09 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హ్యామ్) రహదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రూ.359.09 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ హ్యామ్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో రహదారి మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడి, ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

spot_img

Most Popular