Monday, August 24, 2026

Buy now

పెంట్లవెల్లి ఆఫీస్‌లో జూపల్లి తనిఖీ

◆ ఆర్డీవోపై మంత్రి జూపల్లి ఆగ్రహం.. స్వయంగా టాయిలెట్ రూమ్ శుభ్రం చేసిన మంత్రి!
◆ ఇందిరమ్మ ఇళ్లకు రూ. 4 లక్షల వరకు సాయం

ప్రజానావ ​ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : నాగర్ కర్నూల్ జిల్లా, పెంట్లవెల్లి మండలం రెవెన్యూ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో వినతుల పరిష్కారం, ఫైళ్ల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో పలు ఫైళ్లు అపరిష్కృతంగా పడి ఉండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, బాధ్యులైన అధికారులను ప్రశ్నించారు. ​తనిఖీల్లో భాగంగా కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి, టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించి ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వయంగా తానే నీళ్లు పోసి శుభ్రం చేసి అధికారులకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి, స్థానికుల నివాస గృహాల స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

ఇప్పటికే గోడలు నిర్మించుకుని స్లాబ్ వేసుకునే దశలో ఉన్నవారికి రూ.2 లక్షలు, బేస్ లెవెల్ పూర్తయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న లబ్ధిదారులకు రూ.4 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. ​పూర్తి పారదర్శకంగా, ఆర్థిక పరిస్థితులు, ఇంటి స్థితిగతులను బట్టే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular