Monday, June 22, 2026

Buy now

సింగరేణి సంస్థ పర్సనల్ అధికారుల కాన్ఫరెన్స్ సమావేశం

రామగుండం: సింగరేణి సంస్థ పర్సనల్ విభాగానికి సంబంధించిన వివిధ అంశాలపై సమీక్ష సమావేశం గురువారం ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయంలో నిర్వహించారు.ఈసమావేశాన్ని జీఎం (పర్సనల్,ఐఆర్) కవిత నాయుడు కొత్తగూడెం కార్ఫోరేట్ నుండి అన్ని ఏరియా ల పర్సనల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సంస్థలోని అన్ని ఏరియాల పర్సనల్ విభాగాల పనితీరు, ఉద్యోగుల గైర్హాజరు క్రమ శిక్షణ చర్యలు సంబంధిత అంశాలు, పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, విజిలెన్స్ కేసులు కార్మిక సంబంధిత సమస్యలు,ఇతర పరిపాలనా అంశాలపై సమగ్రం గా సమీక్షించారు.పెండింగ్‌లో ఉన్న అన్ని ఫైళ్లు,ఉద్యోగుల సమస్యలు పలు అంశాలను ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించడంలో పర్సనల్ విభాగం మరింత చురుకుగా వ్యవహరించాలని,సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేయాలని ఆమె పేర్కొన్నారు.ఈ సమావేశంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి,డివై పియం నాగుల వేణు, సీనియర్ పీఓలు శ్రావణ్ కుమార్,ఫిరోజ్ ఖాన్, హనుమంతరావు,అన్ని గనుల సంక్షేమ అధికారులు,పర్సనల్ విభాగ అధికారులతో పాటు వివిధ శాఖల అధిపతులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular