Sunday, October 4, 2026

Buy now

సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన INTUC నాయకులు

సింగరేణి సంస్థ భవిష్యత్ అవసరాలు, దేశంలో పెరుగుతున్న బొగ్గు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు, పలు నూతన ఓపెన్‌కాస్ట్ గనుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గతంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ని పలుమార్లు కలసి విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా తాడిచర్ల ఓసీ-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకే కేటాయించాలని ఆయన కోరారు.
ఈ విజ్ఞప్తిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణి సంస్థకే కేటాయించనున్నారు.ఇటీ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి వర్యులు INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కి ఫోన్ లో తెలియచేయటం జరిగింది.

దీనిపై INTUC జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి హర్షం వ్యక్తం చేయగా ఈ రోజు సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణి సంస్థకే కేటాయించడంలో ముఖ్య పాత్ర పోషించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి సింగరేణి కార్మికుల పక్షాన,INTUC పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేచేశారు.

Related Articles

spot_img

Most Popular