Wednesday, July 15, 2026

Buy now

బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి నడ్డా సమీక్ష

* స్థానిక అంశాలపై చర్చించిన ప్రజాప్రతినిధులు – వైద్య సేవల విస్తరణకు ప్రాధాన్యం.

యాదాద్రి భువనగిరి: జిల్లా బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) అభివృద్ధి, వివిధ నిర్మాణ పనుల పురోగతిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అధ్యక్షతన గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలో కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సమీక్షా సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఎయిమ్స్ కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, డి.కె. అరుణ, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అమిత్ అగర్వాల్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది.

అనంతరం కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, అందుతున్న వైద్య సేవలు, నిర్మాణంలో ఉన్న భవనాల పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు, వైద్య సిబ్బంది, విద్యార్థులకు అవసరమైన వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాల వైద్య సేవలను త్వరితగతిన పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో బీబీనగర్ ఎయిమ్స్‌ను దేశంలోనే ఆదర్శవంతమైన వైద్య సంస్థగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎయిమ్స్ ఉన్నతాధికారులు, వైద్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular