Tuesday, August 25, 2026

Buy now

నేడు శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట ఉత్సవాలు

పెద్దపల్లి : ప్రతిష్టాపన ఉత్సవాలకు సిద్ధమవుతున్న జిల్లాలోని పెద్దపల్లి మండలం రాగినేడు దేవాలయం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయ మైన రాగినేడు లోని శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ట ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ కోలేటి దామోదర్ నిర్మాణ సారధ్యంలో అత్యంత వైభవంగా నిర్మిత నిర్మించబడినటువంటి ఈ దేవాలయంలో ఆగస్టు 26 బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ స్వయం భూ నాగలింగేశ్వర స్వామి (చెట్టు కింద శివయ్య) పున ప్రతిష్ట మహోత్సవము అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించనున్నారు. ఇదే కాకుండా ఈ దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ చండీశ్వర స్వామి విగ్రహాలను సైతం ప్రతిష్టించనున్నారు.

వేములవాడ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన స్థానాచార్యులు ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ సారధ్యంలో ఆరుగురు అర్చకుల తో పాటు, రాగినేడు దేవాలయ ప్రధాన అర్చకులు రాజేశ్వరి శర్మ మరియు ఇతర అర్చకులు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. నేటి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు ప్రతిష్ట ఉత్సవాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించుటకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవాలయమును పూల మాలలతోప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.

ఈ సందర్భంగా దేవాలయంలో నిర్వహించే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుటకై స్థానిక సర్పంచ్ సోమ కుమార్, గౌరవ అధ్యక్షులు గుమ్మడి విజయ్ లు, దేవాలయం చైర్మన్ పోతురాజుల భూమయ్య లు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాగినేడు గ్రామంలోని సమస్త ప్రజలతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించనున్నారు.

Related Articles

spot_img

Most Popular