– భేషరతు శక్తిని వెనక్కి తీసుకోవాలి.
– SBTET లోనే పాలిటెక్నిక్ కొనసాగించాలి.
ప్రజానావ / మంచిర్యాల :కోటపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఆసంపెల్లి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 130కి పై చిలుకు కళాశాలలోని వేలాది పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ విద్యార్థులు జీ.వో 97 ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ, రోడ్ ల పైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే వారి గొంతులను నుమిలే దుర్మార్గమైన చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడడం దారుణం అని అన్నారు.
శక్తి ద్వారా మా భవిష్యత్ నిర్వీర్యం అవుతుంది, మా గుర్తింపు పోతుంది, మా విద్యావ్యవస్థను ప్రయివేట్ పరం చేస్తూ, మేము లేటరల్ విధానం ద్వారా మేము ఇంజనీరింగ్ చేసే సాధావకాశాన్ని కోల్పోతున్నాం అంటూ కంటతడి పెట్టుకుంటున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం వెంటనే జీవో నెం 97 ని రద్దు చెయ్యాలి లేదంటే Gen-Z ఉద్యమం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం యొక్క ఫౌండేషన్ లు ఏవిధంగానైతే కదిలిపోయి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందో?తెలంగాణ లో కూడా అదే పరిస్థితి వస్తుందని మండి పడ్డారు.
ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ను కొల్లగొట్టే దోరనితో వ్యవహారిస్తుంది. అందుకే ఈ రాష్ట్ర ప్రజలను, జనాన్ని కాపాడుకోవడానికి జనతా గ్యారేజ్ లాంటి తెలంగాణ భవన్, కెసిఆర్ నాయకత్వం అందుబాటులో ఉంది అని. మా ప్రియతమా నాయకులు చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, విద్యార్థి నాయకులు డా. బాల్క సుమనన్న నాయకత్వం లో పెద్ద మొత్తం లో ఉద్యమం చేస్తాం. చివరికి ఈ ప్రభుత్వానికి పాలిటెక్నిక్ విద్యార్థులే పాడకడతారని హెచ్చరించారు.

