* మంచిర్యాల పట్టణంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ ర్యాలీ
మంచిర్యాల: అత్యంత పవిత్రమైన మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలో ముస్లిం సోదరులు మిలాద్-ఉన్-నబీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి చౌరస్తా వద్ద ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులకు పండ్లు, వాటర్ పంపిణీ చేశారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు, కార్పొరేటర్ ఖలీద్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పూదరి తిరుపతి, మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, పీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇన్చార్జి నూకల రమేష్ తదితరులు పాల్గొని పండ్లు, తాగునీటిని పంపిణీ చేశారు.
ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు
కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు మీనాజ్, మక్బుల్, కాల్వల జగన్ రావు, మాజీ కౌన్సిలర్ మీనాజ్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జలీల్, మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సోదరభావం, సామరస్యంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

