Wednesday, August 26, 2026

Buy now

SIR ఫేజ్-2 శిక్షణ తరగతులు

* “మన బూతులో మన ఓట్లను కాపాడుకుందాం” — ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
* పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలి

గోదావరిఖని: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ఫేజ్-2 ప్రక్రియలో భాగంగా బుధవారం గోదావరిఖనిలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, దీపక్ రాథోడ్, ప్రభాకర్ రెడ్డి, ఫహీం తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతి ఓటరుకు జాబితాలో చోటు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ “మన బూతులో మన ఓట్లను కాపాడుకుందాం” అనే లక్ష్యంతో SIR ఫేజ్-2 ప్రక్రియను అధికారులు, బూత్ స్థాయి సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అనర్హులు లేదా మరణించిన వారి వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా SIR ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని కోరారు.

బాధ్యతగా విధులు నిర్వహించాలి
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు మాట్లాడుతూ SIR ఫేజ్-2 శిక్షణలో అందిస్తున్న మార్గదర్శకాలను సిబ్బంది పూర్తిగా అవగాహన చేసుకుని క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతి దశలో నిబంధనలను పాటిస్తూ అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షించేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular