ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : రేవల్లి మండల మాజీ జడ్పీటీసీ భీమయ్య సోదరుడి కూతురు వివాహ వేడుక శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరై, నూతన వధువును ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వారి భవిష్యత్తు సంతోషకరంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

