పెద్దపల్లి బ్యూరో : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రం ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బి ఎ., బి.కం., బి. ఎస్సీ) కోర్సులలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల దూరవిద్య అడ్మిషన్లు జరుగుతున్నాయి.
విద్యార్థుల సౌకర్యార్థం అడ్మిషన్ల గడువును సెప్టెంబర్ 9 వరకు పొడిగించినట్లు తెలియజేయడమైనది. అదేవిధంగా కొత్తగా అడ్మిషన్ పొందదలచిన విద్యార్థులకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు సంబంధిత అధ్యయన కేంద్రంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకొని, ఆన్లైన్లో ఫీజు చెల్లించిన అనంతరం కింది పత్రాల జిరాక్స్ కాపీలను సమర్పించాలి:
– ఆధార్ కార్డు
– 10వ తరగతి మెమో
– ఇంటర్మీడియట్ మెమో
– కమ్యూనిటీ సర్టిఫికెట్
– డిగ్రీ మెమోలు (పీజీ విద్యార్థులకు)
– పాస్పోర్ట్ సైజు ఫోటోలు
– అవసరమైన ఇతర ధ్రువపత్రాలు
ఓపెన్ ఇంటర్మీడియట్, రెండేళ్ల ఐటీఐ లేదా పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. పీజీ కోర్సుల్లో చేరేందుకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న పీజీ, డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు కూడా చివరి తేదీ సెప్టెంబర్ 9 వరకు అవకాశం కలదు.
కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్ణీత గడువులోగా తమ అడ్మిషన్లను పూర్తి చేసుకోవాలని పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కే. లక్ష్మీనర్సయ్య, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డా. ఎం.ఏ. షుకూర్ తెలిపారు.

