Friday, September 4, 2026

Buy now

కాంగ్రెస్ ప్రజాపాలనకు 1000 రోజులు.. కరీంనగర్‌లో భారీ బైక్ ర్యాలీ

కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఇందిరా చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు సాగిన ఈ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు బైక్‌లపై ర్యాలీగా ముందుకు సాగుతూ ప్రజా ప్రభుత్వానికి తమ మద్దతును చాటారు.

కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు.“ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం.. ప్రగతి పథంలో తెలంగాణ” అనే నినాదంతో ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది.

Related Articles

spot_img

Most Popular