Friday, September 4, 2026

Buy now

ఉత్తర తెలంగాణ రైల్వే కనెక్టివిటీకి మరో కీలక ముందడుగు

* సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–హైదరాబాద్‌ జనసాధారణ్‌ ప్రత్యేక రైలు

పెద్దపల్లి: ఉత్తర తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌తో మరింత మెరుగైన రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి రావడం సంతోషకరమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–హైదరాబాద్‌ మధ్య జనసాధారణ్‌ ప్రత్యేక రైలు అందుబాటులోకి రావడం ఉత్తర తెలంగాణ రైల్వే కనెక్టివిటీకి మరో కీలక ముందడుగుగా పేర్కొన్నారు.

పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ప్రాంతాల ప్రజల రైల్వే అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త రైళ్లు, అదనపు స్టాపేజ్‌లు, రైళ్ల పొడిగింపుల కోసం రైల్వే శాఖ, రైల్వే బోర్డు దృష్టికి నిరంతరం తీసుకెళ్తున్నట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.ప్రజల డిమాండ్లను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి, వాటికి పరిష్కారం చూపించి ఫలితాలు సాధించడమే తన లక్ష్యమన్నారు.

మెరుగైన రైల్వే కనెక్టివిటీ కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదని, ఉద్యోగాలు, వ్యాపారం, పరిశ్రమలు, విద్య, వైద్యం, పర్యాటకం వంటి అనేక రంగాల అభివృద్ధికి ఇది ఎంతో కీలకమని ఎంపీ పేర్కొన్నారు.గతంలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు రామగుండంలో స్టాప్‌ సాధించామని గుర్తుచేశారు. ఉత్తర తెలంగాణ ప్రజల రైల్వే అవసరాల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.

Related Articles

spot_img

Most Popular