Friday, September 4, 2026

Buy now

కొడిమ్యాల గడ్డపై కాంగ్రెస్ జోష్.. 1000 బైక్‌లతో విజయోత్సవ ర్యాలీ!

* ర్యాలీతో దద్దరిల్లిన రహదారులు.. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సంబరాల్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కొడిమ్యాల:కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కొడిమ్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ నుంచి పూడూర్ చౌరస్తా వరకు సుమారు 1000 బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. భారీ సంఖ్యలో బైక్‌లతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ర్యాలీలో పాల్గొనడంతో కొడిమ్యాల రోడ్లు కాంగ్రెస్ జెండాలు, నినాదాలతో సందడిగా మారాయి.

ర్యాలీ పూడూర్ చౌరస్తాకు చేరుకున్న అనంతరం మండల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులు ప్రజలకు వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో ముందుకు సాగుతోందని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ విజయోత్సవ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, అభిమానులు, మండల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు.

Related Articles

spot_img

Most Popular