Sunday, October 13, 2024

Buy now

nick west: వామ్మో.. బీర్లు తాగి 14లక్షలు సంపాదించిండు

బీర్లు తాగి ఓ వ్యక్తి రూ.14లక్షలు సంపాదించాడు. బ్రిటన్‌కు చెందిన 65ఏళ్ల నిక్‌వెస్ట్‌ అనే వ్యక్తి నాలుగు దశాబ్దాలుగా చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నాడు.

ఈ క్రమంలో మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. అయితే తను తాగిన బాటిళ్లను దాచుకోవడం హాబీగా చేసుకున్నాడు. ఈ క్రమంలో తాను ఉంటున్న ఇల్లు మొత్తం బీరు బాటిళ్లతోనే నిండిపోయింది.

దీంతో తన హాబీని వదులుకోవడం ఇష్టంలేని నిక్‌ మరో ఐదు పడకల గదిని అద్దెకు తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఈ ఇల్లు కూడా బీరు బాటిళ్లతో నిండిపోవడంతో సమస్యలు ఎదురయ్యాయి.

దీంతో ఆ ఖాళీ బీరు బాటిళ్లను అమ్మేద్దామని నిక్‌ నిర్ణయించుకున్నాడు. వెంటనే అతడు తన వద్ద దాచుకున్న బీరు బాటిళ్లను విక్రయించగా $13500 వచ్చాయి.

అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.14 లక్షలు అన్నమాట. దీంతో నిక్‌ ఆనందానికి అంతాఇంతా కాదు. ఆ తర్వాత ఇటలీలోని బీర్‌ క్యాన్‌ డీలర్లకు మరో 1800 బాటిళ్లను అమ్మగా $12500 డాలర్లు వచ్చాయి.

అంటే మన కరెన్సీలో రూ.10,43,526లు అన్నమాట. నిక్‌ తన హాబీతో ఇలా లక్షాధికారి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Related Articles

spot_img

Most Popular