మంత్రి పొన్నం సవాల్ స్వీకరించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
బీఆర్‌ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పొన్నం విసిరిన సవాల్‌కు తడిబట్టలతో ప్రమాణం చేశారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ‘ఈరోజు దేవుడి సాక్షిగా మీరు చేసిన సవాల్‌ను నేను స్వీకరించాను. నేను ఎక్కడా ఒక్క అవినీతి కూడా చేయలేదు.
చేసే అవసరం నాకు లేదు. తడిబట్టలతో ప్రమాణం చేస్తున్నా. మీకు కూడా నేను సవాల్ చేస్తున్నా. రేపు 12 గంటలకు మీరు అపోలో వేంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి నా సవాల్‌ని స్వీకరించి నిజాయితీ నిరూపించుకుంటారా?
ఒకవేళ మీరు రాకపోతే అన్ని స్కాములు చేసినట్టే. అక్రమంలో వేల కోట్ల రూపాయాలు దోచుకున్నానని మీరు ఒప్పుకున్నటే’నని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.