నాగర్ కర్నూల్ : జిల్లాలోని తెలకపల్లి మండలంలో పలు ఎరువుల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రమైన తెలకపల్లి లోని అయ్యప్ప ట్రేడర్స్ సాయిరాం ట్రేడర్స్ శ్రీ మణికంఠ ట్రేడర్స్ ఆగ్రో రైతుసేవ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు మండల వ్యవసాయ అధికారి నర్మదా తో పాటు తహసిల్దార్ విజయకుమార్ ఎస్సై రమేష్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.
ఆయా దుకాణాల గోదాములు తనిఖీలు చేసి ఎరువుల నిలువలు ధ్రువీకరణ పత్రాలు తదితర వాటిని పరిశీలించారు యూరియా బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు కొనసాగించాలని ప్రభుత్వ నిబంధన ప్రకారమే యూరియా పంపిణీ కొనసాగించాలని టాస్క్ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు.
స్టాకు సంబంధించిన రికార్డులను పరిశీలించి ఆయా దుకాణాల్లో ఉన్న స్టాక్ ను లెక్కించారు అమ్మకాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు కంపెనీ లైసెన్సులు స్టాక్ రిజిస్టర్లు తప్పనిసరిగా నిర్వహించాలని లేనియెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దుకాణాలలో కొనసాగే ప్రతి విక్రయానికి విధిగా రైతుకు బిల్లు ఇవ్వాలని డీలర్లకు సూచించారు నిబంధనలను ముల్లంగించిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుతం విత్తనాలను వేసుకునే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న ఎరువుల దుకాణాలను తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో అనధికారికంగా విత్తనాలను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

