Friday, July 17, 2026

Buy now

ఒంటరి మహిళా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక ప్రోత్సాహకం

* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి : ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు నష్టపోకుండా వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఒంటరి మహిళా రైతులకు ఆయిల్ పామ్ సాగు పై ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు ఉద్యాన శాఖ ద్వారా నాణ్యమైన మొక్కల సరఫరాతో పాటు అంతర పంటల సాగు, తోట నిర్వహణ కోసం నాలుగు సంవత్సరాల పాటు ప్రభుత్వం రాయితీలు అందజేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఈ పంట ద్వారా రైతులు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో పట్టా భూమి కలిగి ఆయిల్ పామ్ సాగు చేయదలచిన ఒంటరి మహిళా రైతులకు ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం అందించే నాలుగు సంవత్సరాల రాయితీలతో పాటు, రైతుకు అయ్యే అదనపు వ్యయాన్ని జిల్లా కలెక్టర్ ఆధీనంలోని నిధుల ద్వారా ప్రత్యేక రాయితీగా అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించడం, రైతులను ప్రత్యామ్నాయ లాభదాయక పంటల వైపు ప్రోత్సహించడం, అలాగే ఒంటరి మహిళలను ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన ఒంటరి మహిళా రైతులు ఈ ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయిల్ పామ్ సాగు చేపట్టి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పొందాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం సమీప ఉద్యాన శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Related Articles

spot_img

Most Popular