Friday, July 17, 2026

Buy now

విద్యార్థినుల భద్రతలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..షీ టీమ్ అవగాహన సదస్సు

* మహిళల భద్రతే లక్ష్యం..
* ఉపాధ్యాయులకు షీ టీమ్ అవగాహన సదస్సు.
* సోషల్ మీడియా, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.
* పిల్లల రక్షణకు పోక్సో చట్టంపై అవగాహన అవసరం: షీ టీమ్ సభ్యురాలు స్నేహాలత

పెద్దపల్లి: విద్యార్థుల భద్రత, మహిళల రక్షణ, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అవగాహన ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమని పెద్దపల్లి షీ టీమ్ సభ్యులు స్నేహలతో పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో షీ టీమ్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యురాలు స్నేహలత మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యార్థులతో సున్నితంగా వ్యవహరించడంతో పాటు వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించి అవసరమైన సమయంలో మార్గనిర్దేశం చేయాలని సూచించారు. పోక్సో చట్టం, సోషల్ మీడియా ప్రభావం, మహిళల భద్రత, ఆన్‌లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృతంగా వివరించారు.మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, విద్యాసంస్థల పరిసరాల్లో షీ టీమ్ నిరంతరం నిఘా నిర్వహిస్తోందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.అలాగే అత్యాశకు లోనై సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలకు గురికావద్దని సూచించారు. ఎవరైనా ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని, మహిళలకు ఏదైనా ప్రమాదం లేదా బెదిరింపులు ఎదురైతే వెంటనే 100 లేదా 112 అత్యవసర సేవలకు కాల్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జగదీశ్వర్, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular