* కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన తెలంగాణ రక్షణ సేన నేతలు
హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ నాయకులు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
బుధవారం హైదరాబాద్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ను కలిసి నాయకులు ఫిర్యాదు పత్రం అందజేశారు. బాధ్యతాయుతమైన పోలీస్ ఉద్యోగంలో ఉండి ఒక మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు.
పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన సదరు కానిస్టేబుల్‌పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాఖాపరంగా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఫిర్యాదు చేసిన వారిలో పార్టీ నాయకులు ఎల్. రూప్ సింగ్, నరేందర్ యాదవ్, మనోజా గౌడ్, నరేశ్ ప్రజాపతి, మహేందర్, ఆర్.వీ.ఆర్. ప్రసాద్ తదితరులు ఉన్నారు.

