Friday, September 4, 2026

Buy now

కవితపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలి

* టిఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సేలెంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు

పెద్దపల్లి బ్యూరో : తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు, మహిళా నాయకురాలు కె. కవితపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

టిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సేలెంద్ర కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్.హెచ్.వో కు ఫిర్యాదు అందజేశారు. ఫేస్‌బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా వేదికల్లో కె.కవితను ఉద్దేశించి అభ్యంతరకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను ప్రచురించి ప్రచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మహిళా నాయకురాలి గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన నిందితుడిపై చట్టప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. అలాగే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు, యుఆర్ఎల్ లు, ఖాతా వివరాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని, అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.

నిందితుడు పోలీస్ శాఖలో పనిచేస్తున్నందున శాఖాపరమైన విచారణ చేపట్టి, ఆరోపణలు రుజువైతే సర్వీస్ నిబంధనల ప్రకారం కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సేలెంద్ర కొమురయ్య యాదవ్, మహిళా నాయకురాలు సిరవేణి స్వప్న, బొంకూరి సుభాష్, దేవానంది లక్ష్మయ్య, సీహెచ్. హనుమాన్లు, కలువల రవీందర్, కలువల తిరుపతి, పొన్నాల ప్రవీణ్, నెత్తెట్ల రాజ్‌కుమార్, భూమయ్య, పోసాని కిట్టు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular