* మండల ఉద్యానవన విస్తరణ అధికారి బి.రాము
పెద్దపల్లి : మండలం లోని బందంపల్లి, ఆపన్నపేట శివార్లలోని కూరాగయ తోటలను మండల ఉద్యాన విస్తరణ అధికారి బి.రాము పరిశీలించారు. ముక్యంగా రైతులు పంట మార్పిడి చేపట్టాలని వరి, పత్తి, మొక్కజొన్న పంటలకి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్లు, పామాయిల్ తోటల సాగు చేపట్టాలని ఉద్యాన విస్తరణ అధికారి బి.రాము అన్నారు. ఈ మేరకు పంట మార్పిడి విధానం ప్రత్యామ్నాయ పంటల సాగు పై రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. పంట మార్పిడి తో రైతులకు ఆదాయ మార్గాలు ఏర్పడతాయాని, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. బోర్ల కింద బావులా కింద డ్రిప్ తో ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్లు, పామాయిల్ తోటలు సాగు చేయాలన్నారు. కూరగాయల నారు టమాట, మిర్చి, వంకాయ 100 శాతం సబ్సిడీతో ఉందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూరగాయల సాగులో మేలైన మల్చింగ్ పద్దతిలో సాగు చేయాలన్నారు. పొలం శ్రీనివాస్, దామోదరి శ్రీనివాస్, సంపత్ రైతులు కూరగాయల రైతులు తదితరులు పాల్గొన్నారు.

