Friday, September 4, 2026

Buy now

గద్వాలకు ‘రైల్వే’ వెలుగులు

◆ ​2027 ఏప్రిల్‌ నాటికి స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
◆ ​రూ.66 కోట్లతో మరో ఆర్‌ఓబీ నిర్మాణం

ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రాష్ట్రంలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద రూ.42.82 కోట్లతో శరవేగంగా జరుగుతున్న గద్వాల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ రిజ్వాన్ భాషా, ఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2027 ఏప్రిల్ నాటికి గద్వాల రైల్వే స్టేషన్ పనులను పూర్తి చేసి, ఈ ప్రాంతాన్ని ప్రధాన రైల్వే హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య నివారణకు రూ.66 కోట్లతో మరో ఆర్‌ఓబీ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

అలాగే గద్వాల రైల్వే స్టేషన్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

Related Articles

spot_img

Most Popular