Friday, September 4, 2026

Buy now

గిరిజన విద్యార్థినికి మర్రి జనార్దన్ రెడ్డి రూ.50 వేల సాయం

ప్రజానావ ​ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : పేదరికం ఏ బిడ్డ భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదని, గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి జీవితంలో ఎదగాలనే లక్ష్యంతో నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.

మండలంలోని పర్వతాయిపల్లి తండాకు చెందిన ముడావత్ సత్యం కుమార్తె అనూష హైదరాబాద్‌లోని శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజీలో ఉచిత సీటు పొందింది. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల హాస్టల్ ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆమె కుటుంబ పరిస్థితి తెలుసుకున్న మర్రి జనార్దన్ రెడ్డి, తన ‘ఎంజేఆర్ ట్రస్ట్’ ద్వారా నిరుడే మొదటి సంవత్సరం ఫీజు కింద రూ.50,000 అందజేశారు.

వరుసగా రెండో సంవత్సరం కూడా హాస్టల్ ఫీజు కోసం రూ.50,000 చెక్కును అనూషకు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular