– జనసేన పార్టీ రాష్ట్ర యువజన విభాగం సిద్దూ
ప్రజానావ / మంచిర్యాల :చెన్నూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు సిద్ధూ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటలకు చెన్నూర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక అర్చన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం చెన్నూర్ పాత బస్టాండ్‌లో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తదుపరి అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించడంతో పాటు, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు,
అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు థియేటర్లలో పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ‘పంజా’ చిత్రాన్ని వీక్షించేందుకు టికెట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలు, శ్యామ్, నవీన్ గంధం, సాయి మామిడి, పొన్నం సాయి, రఘు, హరీష్, సాయి కిరణ్, ఆడేటి సాయికుమార్, ఆంజనేయ ప్రసాద్, ప్రశాంత్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

