Friday, September 4, 2026

Buy now

తల్పునూరులో బి.ఎస్.పి బూత్ కమిటీ ఎన్నిక

ప్రజానావ ​ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ బూత్ కమిటీ నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బి.ఎస్.పి వనపర్తి జిల్లా అధ్యక్షుడు మిద్దె మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటి మధు హాజరయ్యారు.

​ఈ సందర్భంగా 316వ బూత్ ప్రెసిడెంట్‌గా కలుమూరి కిరణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా వడ్డేమాన్ రాము, కార్యదర్శులుగా వడ్డేమాన్ చిన్న బుడ్డయ్య, గాలిగాళ్ళ శివకుమార్, బోడ వేణు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను నాయకులు అభినందించారు. బహుజనుల ఐక్యతతోనే బహుజన రాజ్యం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

Related Articles

spot_img

Most Popular