Friday, September 4, 2026

Buy now

పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యం

* ఎన్నికల తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన కర్తవ్యం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* SIR ఫేజ్–2 గ్రామ సభలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే

కడెం: పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో SIR ఫేజ్–2లో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారం, ప్రజా శ్రేయస్సే తనకు ముఖ్యమని బొజ్జు పటేల్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు.

అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండాలి

SIR ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

ఓటరు జాబితాలో పేర్లు, వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ప్రజలు SIR ప్రక్రియను సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో తమ వివరాలను సరిచూసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కోరారు.

Related Articles

spot_img

Most Popular