Friday, September 4, 2026

Buy now

పుట్టుకతోనే దివ్యాంగురాలైన రజితకు ఎమ్మెల్యే సత్యం భరోసా

* వెంకటాయపల్లిలోని రజిత ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే
* దివ్యాంగుల పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం

చొప్పదండి: పుట్టుకతోనే దివ్యాంగురాలైన రజిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం భరోసా కల్పించారు.గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఇడగొట్టి వెంకటి–హారిక దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి మూడవ కుమార్తె రజితను ఎంతో కష్టపడి పెంచుతున్న విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం స్వయంగా రజిత ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా రజిత పరిస్థితిని దగ్గరుండి పరిశీలించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే, రజితకు దివ్యాంగుల పెన్షన్ మంజూరయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

Related Articles

spot_img

Most Popular