Saturday, June 27, 2026

Buy now

పెట్రోల్ డీజిల్ సరఫరా పై కేంద్రం తాత్కాలిక నియంత్రణలు

నాగర్ కర్నూల్ : కేంద్ర ప్రభుత్వం మోటారు స్పిరిట్ (పెట్రోల్), హై స్పీడ్ డీజిల్ సరఫరా పై తాత్కాలిక నియంత్రణలు విధించిందని జిల్లాలోని వినియోగదారులు పెట్రోల్ బంక్ నిర్వాహకులకు పలు సూచనలు చేసిందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికార నరసింహారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు భారత ప్రభుత్వం పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ వారు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా పై కొన్ని తాత్కాలిక నియంత్రణలు అమల్లోకి తేవడం జరిగిందన్నారు

ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వచ్చి 90 రోజులపాటు అమలు లో ఉంటాయని తెలిపారు ఇటీవల కొన్ని ప్రాంతాలలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలు అసాధారణంగా పెరిగాయని ముఖ్యంగా పారిశ్రామిక వాణిజ్య సంస్థ గత వినియోగదారులు బల్క్ కొనుగోలు మార్గాలను విడిచిపెట్టి రిటైల్ అవుట్ లేట్ల ద్వారా ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్ల సాధారణ వినియోగదారులకు ఇంద్ర లభ్యతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని నియంత్రణలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు సంస్థ గత పారిశ్రామిక వాణిజ్య వినియోగదారులు పెట్రోల్ లేదా డీజిల్ను రిటైల్ పెట్రోల్ బంకుల నుండి కొనుగోలు చేయవద్దని తమ అవసరాలకు తమకు కేటాయించిన వినియోగదారుల పంపులు లేదా బల్క్ సరఫరా ద్వారా మాత్రమే పొందాలన్నారు డీజిల్ విక్రయం వాహనాల ట్యాంకులకు పిఇఎస్ఓ ఆమోదించిన కంటైనర్లకు మాత్రమే చేయాలని ఒక వినియోగదారుడు వాహనానికి రోజు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించబడుతుందని ఈ విధంగా కొనుగోలు చేసిన డిజైన్లు పునర్విక్రయం చేయడం పూర్తిగా నిషేధించబడిందన్నారు

అన్ని పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సంబంధిత అధికారులు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని లేనియెడల చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు బ్లాక్ మార్కెటింగ్ అక్రమ నిల్వ అనధికార కొనుగోలు విక్రయం ఇంధన మళ్లింపు వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు జిల్లాలోని అన్ని పెట్రోల్ డీజిల్ రేట్ నిర్వాహకులు పారిశ్రామిక వాణిజ్య వినియోగదారులు సాధారణ ప్రజలు వీటిని గమనించాలని సూచించారు.

Related Articles

spot_img

Most Popular