హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు కీలక ఊరట కల్పించింది. ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.
ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు రూ.1 లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని, కోర్టు విధించిన అన్ని షరతులను తప్పనిసరిగా పాటించాలని ఆదేశిస్తూ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
కాగా, అంతకుముందు పరీక్షలు రాసేందుకు లోయర్ కోర్టు భగీరథ్‌కు వారం రోజులపాటు తాత్కాలిక (ఇంటరిమ్) బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువు ముగియడంతో జూన్ 25న ఆయన తిరిగి జైలులో లొంగిపోయారు. అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

