సిద్దిపేట: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై పర్యవేక్షణ కోసం జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ నదీమ్ 22న (సోమవారం) సిద్దిపేట ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.22న జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష.. కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ సూచన చేశారు.
ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22న తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజావాణి కార్యక్రమం కోసం సోమవారం రోజున కలెక్టరేట్‌కు రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.ప్రత్యేక సమీక్ష సమావేశం కారణంగానే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

