Friday, September 4, 2026

Buy now

ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం

* లక్షెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
* అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగకరం

లక్షెట్టిపేట్: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రులకు సురక్షితంగా తరలించేందుకు ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.

ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అత్యవసర వైద్య పరిస్థితుల్లో వెంటిలేటర్‌పై ఉన్న రోగులను మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రులకు తరలించేందుకు ఈ అంబులెన్స్ సేవలు ఎంతో కీలకంగా నిలుస్తాయని తెలిపారు. పేద, సామాన్య ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ప్రజల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పిస్తుందని అన్నారు.

ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, అలాంటి సమయంలో వెంటిలేటర్ సదుపాయంతో కూడిన అంబులెన్స్ అందుబాటులో ఉండటం వల్ల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతిమ ఫౌండేషన్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని ఆయన అభినందించారు.

అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం, అవసరమైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రతిమ ఇన్స్టిట్యూట్ సీఈఓ రామచందర్రావు, ప్రతిమ హాస్పిటల్ క్రిటికల్ కేర్ డాక్టర్ ప్రవీణ్, లక్షెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి–నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి–వెంకట స్వామి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, జిల్లా ఆర్జీపీఆర్‌ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, జిల్లా నాయకులు పూర్ణచంద్రరావుతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular