ప్రజానవ,మెదక్:ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా, పారదర్శకంగా విచారించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు, ఐపీఎస్ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులు, ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విని, సంబంధిత అధికారులు చట్టపరిధిలో విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావు ఉండకూడదన్నారు. ప్రతి వినతిదారునికి వారి ఫిర్యాదు పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందిస్తూ, సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించడం మెదక్ జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.

