Friday, September 4, 2026

Buy now

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ బీజేవైఎం నాయకుల ఆందోళన

పెద్దపల్లి : బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాలు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేవైఎం నాయకులు ఎర్రోళ్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండాలను దహనం చేసి, రాస్తారోకో నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విలువలను, ప్రతిపక్ష పార్టీల హక్కులను కాలరాస్తూ దాడులకు పాల్పడటం సిగ్గుచేటని బీజేవైఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు.

రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి దాడులతో బీజేపీ శ్రేణులను భయపెట్టడం కాంగ్రెస్ పార్టీ వల్ల కాదని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని స్పష్టం చేశారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులను ఆలస్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని వారు ఆరోపించారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేసి విద్యార్థుల విద్యాభవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్షలకు తావివ్వకుండా, బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించి, వారి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ పెంజర్ల రాకేష్, బీజేపీ మండల అధ్యక్షులు మరియు సర్పంచ్ వేల్పుల రమేష్, బీజేవైఎం నాయకులు కూసనపల్లి మధుకరన్ భగవత్, బీజేవైఎం మండల అధ్యక్షుడు రేండ్ల వేణు బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి గుడ్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి మామిడి ఉమేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేందర్, బీజేపీ నాయకులు పోగుల రాజు, సిలివేరి మహేష్, కుక్క అంజి,ముక్కెర కుమార్, వెలిచల నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular