కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని అరుణోదయ డిగ్రీ కళాశాలలో బజాజ్ ఫైనాన్స్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగానికి సంబంధించిన అంశాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. శిక్షణ అనంతరం బజాజ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేశారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పోతని ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపాల్ పోతని నవీన్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

