Wednesday, July 15, 2026

Buy now

రగుడు రౌండబౌట్ వద్ద రోడ్డు భద్రతా చర్యలపై అధికారుల పరిశీలన

సిరిసిల్ల : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు రగుడు రౌండబౌట్ జంక్షన్ వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా రవాణా శాఖ, రోడ్లు & భవనాల శాఖ (ఆర్&బీ), మున్సిపల్ శాఖ, ట్రాఫిక్ పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.

ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి, ఆర్&బీ డీఈ, ఆర్టీఏ సభ్యుడు, మున్సిపల్ కమిషనర్, ట్రాఫిక్ ఎస్‌ఐతో పాటు సంబంధిత అధికారులు జంక్షన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రౌండబౌట్‌కు ముందు అన్ని దిశల్లో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం, హెచ్చరిక, దిశా సూచిక, వేగ పరిమితి బోర్డులు ఏర్పాటు చేయడం, రాత్రి వేళల్లో మెరుగైన స్ట్రీట్ లైటింగ్ కల్పించడం, రౌండబౌట్‌ను ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి రిఫ్లెక్టివ్ మార్కింగ్‌లు, క్యాట్ ఐస్ ఏర్పాటు చేయాలని సూచించారు.

అలాగే థర్మోప్లాస్టిక్ రోడ్ మార్కింగ్‌లు, స్టాప్ లైన్లు, జీబ్రా క్రాసింగ్‌లు అవసరమైన చోట వేయడం, జంక్షన్ వద్ద పొదలు, ఇతర అడ్డంకులను తొలగించి దృశ్యమానతను మెరుగుపరచడం, అవసరమైతే స్పీడ్ కాల్మింగ్ చర్యలు చేపట్టి అధిక వేగాన్ని నియంత్రించడం, ట్రాఫిక్ రద్దీ సమయాల్లో ప్రత్యేక పోలీసు పర్యవేక్షణ నిర్వహించాలని నిర్ణయించారు.

భారీ వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సూచించారు.

ఈ సందర్భంగా అధికారులు వాహనదారులకు విజ్ఞప్తి చేస్తూ, అధిక వేగంతో ప్రయాణించవద్దని, ట్రాఫిక్ సూచికలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular