Friday, September 4, 2026

Buy now

రామడుగులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

* ముఖ్య అతిథిగా హాజరై ఉట్టి కొట్టిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు,సెప్టెంబర్ 4: రామడుగు మండల కేంద్రంలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి శాసనసభ్యులు డా. మేడిపల్లి సత్యం హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉట్టి కొట్టి కృష్ణాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు కృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.కృష్ణాష్టమి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనందం, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. వేడుకల్లో స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular