Friday, September 4, 2026

Buy now

SIR ఫేజ్–2పై కాంగ్రెస్ ఇంచార్జ్‌లతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమీక్ష

* అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా అప్రమత్తంగా పనిచేయాలి

గోదావరిఖని, సెప్టెంబర్ 4: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) ఫేజ్–2పై రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ SIR ఇంచార్జ్‌లతో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. SIR ఫేజ్–2 ప్రక్రియలో ప్రతి ఓటు కీలకమని, అర్హులైన ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంచార్జ్‌లు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో బూత్ స్థాయిలో ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు.

అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు, SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, SIR ఇంచార్జ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular