* దోషులపై రాష్ట్ర ప్రభుత్వం కపటప్రేమ
* విద్యార్థినిలు, యువతులకు భద్రత కరువు
* నర్సు రేప్ ఘటన నిందితుడిని ఎంకౌంటర్ చేయాలి
* కలెక్టరేటు ఎదుట మహిళా సురక్షావేధిక ధర్నా
పెద్దపల్లి బ్యూరో : రాష్ట్రంలో హిందూ మహిళలే టార్గెటుగా లవ్ జిహాద్ మూకలు రెచ్చిపోతున్నాయని, విద్యార్థినిలు, యువతులకు భధ్రత కరువయ్యిందని మహిళా సురక్షా వేధిక ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణాలో హిందూ మహిళలపై చోటుచేసుకున్న వరుస లవ్ జిహాద్ సంఘటనల నేపధ్యంలో బుధవారం మహిళా సురక్షా వేధిక ఆద్వర్యంలో కలెక్టరేటు ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఠాకూర్ తారబాయి మాట్లాడుతూ హిందూ మహిళలను ప్రేమపేరుతో లోబరుచుకొని, బ్లాక్ మెయిల్ చేయడం, మతం మార్చడం, చిత్రహింసలకు గురిచేయడం వంటి ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నా నిందితులపై కఠిన చర్యలను తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ముస్లీములకు ఆయుధంగా మారిందని, దీనివల్ల రోజుకో దారుణ ఘటన వెలుగులోకి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుక్కుగూడ నర్సుపై జరిగిన అత్యాచారం హత్య కేసును నీరుగార్చే పనిలో ఉన్నారని, దోషిని బహిరంగంగా ఎంకౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఐటి కంపెనీల్లో సైతం ఉద్యోగినిలపై లైంగిక వేధింపులు, ఇల్లందులో బీటెక్ విద్యార్తినిపై మతమార్పిడి వేధింపులు, గోల్నాకాలో మహిళకు చెందిన ప్రయివేటు వీడియోలను చూపించి బెదిరింపులు, మాదాపూరు లో మహిళా ఆత్మహత్య తదితర ఘటనపై సత్వర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ బారిన పడకుండా ఉండాలని, స్వధర్మం గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఇంకా బుజ్జగింపు విధానాలను వీడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
ధర్నా అనంతరం కలెక్టరేటు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో కందుల సంధ్యారాణి, నిర్మల, భారతి, రాయకం ఝాన్సీ, రంగు వాణి, ఉయ్యాంకార్ సాయి కుమార్, బండి మమత, అట్ల రజిత, బెజ్జంకి దిలీప్, కావేటి రాజగోపాల్, రామగిరి అఖిల్, పూసల శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.

