Friday, September 4, 2026

Buy now

విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు సాధించాలి

* అభ్యాస జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డేలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్‌లో ఉన్న మంచిర్యాల గార్డెన్స్‌లో నిర్వహించిన అభ్యాస జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలకు మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె వీక్షించారు. అనంతరం విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. కొత్తగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగాలి
విద్యార్థి దశలో క్రమశిక్షణ, పట్టుదల, కృషి ఎంతో ముఖ్యమని కొక్కిరాల సురేఖ అన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు.

కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అభినందించిన ఆమె.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, స్థానిక కార్పొరేటర్ చింతపండు శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇన్‌చార్జి నూకల రమేష్, కళాశాల కరస్పాండెంట్ రమణ, ప్రిన్సిపల్ ఆర్. శ్రీనివాస్, డైరెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ సుధాతి–గిరీష్, మానయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular