Friday, September 4, 2026

Buy now

వీపనగండ్ల మండలంలో ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి జూపల్లి సమీక్ష

◆ రెండుమూడు రోజుల్లో 54 మంది పెండింగ్ లబ్ధిదారుల ఎంపిక పూర్తికావాలి
◆ అధికారుల నిర్లక్ష్యంపై హెచ్చరిక

ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : వీపనగండ్ల మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షించారు. మండలానికి కేటాయించిన 375 ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటివరకు 321 మందిని గుర్తించగా, ఇంకా 54 మంది లబ్ధిదారుల ఎంపిక పెండింగ్‌లో ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

మూడు రోజుల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా పెండింగ్ ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి, గెజిటెడ్ అధికారుల వెరిఫికేషన్, శాంక్షన్ వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే, L3 జాబితాలో నమోదైన అర్హుల వివరాలను పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవోలకు అందించి, హౌసింగ్ లాగిన్‌లోని L3 to L1 మెడల్ ద్వారా వారం రోజుల్లో కలెక్టర్‌కు పంపాలని స్పష్టం చేశారు. అనంతరం గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల పురోగతిపై సమీక్షించి అధికారులకు తగిన సూచనలు చేశారు.

Related Articles

spot_img

Most Popular