Wednesday, June 24, 2026

Buy now

రంగారెడ్డి జిల్లాలో రూ.87 కోట్ల విలువైన రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన,ప్రారంభోత్సవం

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాలకు మెరుగైన రహదారి అనుసంధానం

రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాల్లో కేంద్ర రహదారి నిధి (CRF) ద్వారా చేపట్టిన సుమారు రూ.87 కోట్ల విలువైన రోడ్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు మంత్రులకు ఘన స్వాగతం పలికారు.
కందుకూరు మండలం లేమూరు గ్రామంలో రూ.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 14 కిలోమీటర్ల డబుల్ లేన్ రహదారి నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ రహదారి లేమూరు నుంచి శ్రీశైలం జాతీయ రహదారి వరకు తిమ్మాపూర్, అగర్మియాగూడ మీదుగా నిర్మించబడనుంది.

అలాగే బేగంపేట గ్రామంలో రూ.17 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 6.2 కిలోమీటర్ల డబుల్ లేన్ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ రహదారి బేగంపేట నుంచి ఎలిమినేడు వరకు మాదాపూర్ మీదుగా అభివృద్ధి చేయబడనుంది.

అనంతరం తిమ్మాపూర్ గ్రామంలో రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన 22 కిలోమీటర్ల రహదారిని మంత్రులు ప్రారంభించారు. ఈ రహదారి ఆర్‌సీఐ గేట్ నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు రావిర్యాల, కొంగరకలాన్, తిమ్మాపూర్, మాదాపూర్, గుమ్మడవల్లి, ఆకుల మైలారం గ్రామాల మీదుగా విస్తరించింది.

ఈ రోడ్ల అభివృద్ధి పనుల ద్వారా మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అనుసంధానం బలోపేతం కానుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల ప్రయాణ సౌలభ్యం, ప్రాంతీయ అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular