Saturday, June 27, 2026

Buy now

జూలై 4 న రాష్ట్ర స్థాయి ఎమ్మెస్సీ జువాలజీ ఎంట్రన్స్ గ్రాండ్ టెస్ట్: ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ నర్సయ్య

పెద్దపల్లి ప్రతినిధి : ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోని జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఎమ్మెస్సీ జువాలజీ ఎంట్రన్స్ గ్రాండ్ టెస్ట్, వచ్చే నెల 4 న ఆన్ లైన్ విధానం లో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.లక్ష్మీ నర్సయ్య తెలియ జేశారు. ప్రతీ సంవత్సరం కళాశాల జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యం లో ,ఆన్ లైన్ విధానం లో ఎమ్మెస్సీ జువాలజీ ఎంట్రన్స్ కోచింగ్ మరియు రాష్ట్ర స్థాయి గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ తెలియజేశారు.

గత సంవత్సరం నిర్వహించిన కోచింగ్ లో ఒక విద్యార్థి రాష్ట్ర స్థాయిలో జువాలాజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు తెలియజేశారు. కాబట్టి ఆసక్తి గల విద్యార్థినీ, విద్యార్థులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని, ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని తెలిపారు.

ఈ సందర్భంగా ఈ పరీక్ష ను నిర్వహిస్తున్న కళాశాల జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సీ.హెచ్. తిరుపతి ని , ప్రిన్సిపాల్ తో పాటు ,వైస్ ప్రిన్సిపాల డాక్టర్ ఏ.సతీష్ కుమార్ అధ్యాపక బృందం అభిందినందించారు.

Related Articles

spot_img

Most Popular