మెదక్: శివ్వంపేట మండలం గంగాయిపల్లి శివారులో పేకాట ఆడుతున్న 5 మంది అరెస్టు. వారి వద్ద నుంచి రూ.11,230 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం.
జిల్లాలో జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

